వెనిగండ్ల (పెదకాకాని)QqAa D89z d Oo YynavNYK P5H ZQc UuKp 8 B

వెనిగండ్ల
—  రెవిన్యూ గ్రామం  —
వెనిగండ్ల is located in Andhra Pradesh
వెనిగండ్ల
వెనిగండ్ల
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°21′05″N 80°28′48″E / 16.351344°N 80.479927°E / 16.351344; 80.479927
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం పెదకాకాని
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీమతి కాట్రాత్తు తులసీబాయి
జనాభా (2011)
 - మొత్తం 7,062
 - పురుషుల సంఖ్య 3,480
 - స్త్రీల సంఖ్య 3,582
 - గృహాల సంఖ్య 1,911
పిన్ కోడ్ 522509
ఎస్.టి.డి కోడ్ 0863

వెనిగండ్ల, గుంటూరు జిల్లా, పెదకాకాని మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన పెదకాకాని నుండి 3 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన గుంటూరు నుండి 10 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1911 ఇళ్లతో, 7062 జనాభాతో 1399 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 3480, ఆడవారి సంఖ్య 3582. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1430 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 902. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 590252[1].పిన్ కోడ్: 522509. ఎస్.టి.డి.కోడ్ = 0863.

విషయ సూచిక

  • 1 గ్రామ చరిత్ర
    • 1.1 గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలు
  • 2 గ్రామ భౌగోళికం
    • 2.1 సమీప గ్రామాలు
    • 2.2 సమీప మండలాలు
  • 3 విద్యా సౌకర్యాలు
    • 3.1 శ్రీ వేమన జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల
    • 3.2 లూథర్ గిరి ప్రాథమిక పాఠశాల
  • 4 వైద్య సౌకర్యం
    • 4.1 ప్రభుత్వ వైద్య సౌకర్యం
    • 4.2 ప్రైవేటు వైద్య సౌకర్యం
  • 5 తాగు నీరు
  • 6 పారిశుధ్యం
  • 7 సమాచార, రవాణా సౌకర్యాలు
  • 8 మార్కెటింగు, బ్యాంకింగు
  • 9 ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు
  • 10 విద్యుత్తు
  • 11 భూమి వినియోగం
  • 12 నీటిపారుదల సౌకర్యాలు
  • 13 ఉత్పత్తి
    • 13.1 పారిశ్రామిక ఉత్పత్తులు
  • 14 గ్రామ పంచాయతీ
  • 15 గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు దేవాలయాలు
    • 15.1 శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం
    • 15.2 శ్రీ నాంచారమ్మ అమ్మవారి ఆలయం
  • 16 గ్రామ విశేషాలు
  • 17 గణాంకాలు
  • 18 మూలాలు

గ్రామ చరిత్ర[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.[2]

గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలు[మార్చు]

తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది.

గ్రామ భౌగోళికం[మార్చు]

సమీప గ్రామాలు[మార్చు]

గోరంట్ల 2 కి.మీ, శివారెడ్డిపాలెం 3 కి.మీ, పాండురంగ నగర్ 3 కి.మీ, మద్దిరాల కాలని 3 కి.మీ.

సమీప మండలాలు[మార్చు]

దక్షణాన గుంటూరు మండలం, ఉత్తరాన తాడికొండ మండలం, తూర్పున మంగళగిరి మండలం, పశ్చిమాన మేడికొండూరు మండలం.

విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు నాలుగు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాల ఒకటి , ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి, ప్రైవేటు మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి.

శ్రీ వేమన జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల[మార్చు]

ఈ పాఠశాల గత నాలుగు సంవత్సరాలలో మూడు సార్లు, మండల స్థాయిలో ప్రథమస్థానం కైవసం చేసుకొని, అగ్రస్థానంలో నిలిచింది. ఉపాధ్యాయుల కృషితోనూ, విద్యార్థుల తల్లిదండ్రుల సహకారంతోనూ ఇది సాధ్యమైనది. [6] 2014లో స్వచ్ఛ భారత్, మెరుగైన సమాజ నిర్మణం అను అంశాలపై, టాటా బిల్డింగ్ ఇండియా సంస్థ వారు రాష్ట్రస్థాయి వ్యాస రచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో, ఈ పాఠశాలలో చదువుచున్న అశ్వనిసాయికిరణ్మయి అను విద్యార్థిని, విజేతగా నిలిచి, జాతీయస్థాయి పోటీలకు ఎంపికై ఒక మెరుపు మెరిసినది. తరువాత నిర్వహించిన జాతీయస్థాయి వ్యాసరచన పోటీలలో రన్నర్-అప్ గా నిలిచి, 2015,డిసెంబరు-4వ తేదీనాడు, ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారి చేతుల మీదుగా పురస్కారం, ప్రశంసలను అందుకొని అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఈమె చదువులోనే గాకుండా ఎన్.సి.సి.కార్యక్రమాలలో గూడా చురుకుగా పాల్గొంటున్నది. ఇటీవల వెనిగండ్లలో జరిగిన రాష్ట్రస్థాయి చదరం పోటీలలో గూడా ఈమె 14 సంవత్సరాల విభాగంలో పాల్గొని, రజత పతకం సాధించడం విశేషం. ఈ సంవత్సరం జిల్లాస్థాయి ఇన్స్ పైర్ ప్రదర్శనలో, "సోలర్ లైటింగ్ సిస్టం" ద్వారా ఖర్చు లేని కాంతిని ఎలా పొందాలి అను అంశం పై తయరుచేసిన ఈమె ప్రదర్శన, రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనది. జాతీయస్థాయిలో జరిగే ఎన్.ఎం.ఎం.ఎస్. ఉపకారవేతన పరీక్షలో ప్రతిభ కనబరచి, ఈమె ఉపకార వేతనానికి ఎంపికైనది. [8]

లూథర్ గిరి ప్రాథమిక పాఠశాల[మార్చు]

సమీప బాలబడి పెదకాకానిలో ఉంది. సమీప జూనియర్ కళాశాల పెదకాకానిలోను, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల గుంటూరులోనూ ఉన్నాయి. సమీప మేనేజిమెంటు కళాశాల నంబూరులోను, వైద్య కళాశాల, పాలీటెక్నిక్‌లు గుంటూరులోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల గుంటూరులో ఉన్నాయి.

వైద్య సౌకర్యం[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు]

వెనిగండ్లలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. పశు వైద్యశాల గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం[మార్చు]

గ్రామంలో4 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు నలుగురు ఉన్నారు. రెండు మందుల దుకాణాలు ఉన్నాయి.

తాగు నీరు[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. తాగునీటి కోసం చేతిపంపులు, బోరుబావులు, కాలువలు, చెరువులు వంటి సౌకర్యాలేమీ లేవు.

పారిశుధ్యం[మార్చు]

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు[మార్చు]

వెనిగండ్లలో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రభుత్వ రవాణా సంస్థ బస్సు సౌకర్యం, ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్ మొదలైనవి గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. జాతీయ రహదారి, ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. రాష్ట్ర రహదారి, జిల్లా రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు[మార్చు]

గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. సహకార బ్యాంకు గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో గ్రంథాలయం ఉంది. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ స్టేషన్, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సినిమా హాలు, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 5 కి.మీ.లోపు దూరంలో ఉన్నాయి.

విద్యుత్తు[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 20 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం[మార్చు]

వెనిగండ్లలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 382 హెక్టార్లు
  • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 8 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 364 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 332 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 312 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 514 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 129 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]

వెనిగండ్లలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 129 హెక్టార్లు

ఉత్పత్తి[మార్చు]

వెనిగండ్లలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

పారిశ్రామిక ఉత్పత్తులు[మార్చు]

పాలిమర్ ప్యాకేజింగు

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో సర్పంచిగా శ్రీమతి కాట్రాత్తు తులసీబాయి ఎన్నికైనారు. ఉప సర్పంచిగా శ్రీ పులగం.రామిరెడ్డి ఎన్నికైనారు. [5]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు దేవాలయాలు[మార్చు]

శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం[మార్చు]

ఈ ఆలయానికి 400 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ ఆలయంలోని స్వామివారి ధూపదీప నైవేద్యాలకు, ఆలయ అభివృద్ధికీ దాతలు 70 ఎకరాల భూమిని దానంగా ఇచ్చారు. ఈ భూముల కౌల ద్వారా ప్రతి సంవత్సరం ఆలయనికి 4 లక్షల రూపాయల ఆదాయం వస్తుంది. అయిననూ ఈ ఆలయ నిర్వహణ అంతంమాత్రంగానే ఉంది. [7]

శ్రీ నాంచారమ్మ అమ్మవారి ఆలయం[మార్చు]

ఈ ఆలయంలో గ్రామస్తుల, దాతల సహకారంతో, అమ్మవారి ఆలయ పునఃప్రతిష్ఠా కార్యక్రమం, 2015,ఫిబ్రవరి-23వ తేదీ సోమవారంనాడు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చుట్టుప్రక్కల గ్రామాలనుండి భక్తులు పెద్దసంఖ్యలో విచ్చేసారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. [5]

గ్రామ విశేషాలు[మార్చు]

(1)గుంటూరు జిల్లాలోని ఈ మారుమూల గ్రామంలో, 8 నుండి 2013 నవంబరు 10 వరకూ, 2వ రాష్ట్రస్థాయి చదరంగం పోటీలు జరిగినవి. ఈ పోటీలు గుంటూరు జిల్లా ఛెస్ అసోసియేషన్ మరియూ వెనిగండ్ల గ్రామ ఛెస్ అకాడమీ వారి సంయుక్త ఆధ్వర్యంలో జరిగినవి. ఈ పోటీలలో 28మంది అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులతో సహా మొత్తం 110 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. [3] (2)వెనిగండ్ల గ్రామానికి చెందిన చి.లిఖితారెడ్డి, 2014,మే-12,13,14 తేదీలలో విశాఖపట్నం జిల్లాలోని అరకులోయలో రాష్ట్ర చదరంగ సమాఖ్య నిర్వహించిన, రాష్ట్రస్థాయి అండర్-15, చదరంగం పోటీలలో, అండర్-11 విభాగంలో పాల్గొని 4వ స్థానం సాధించింది. [4]

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 6,736.[3] ఇందులో పురుషుల సంఖ్య 3,432, స్త్రీల సంఖ్య 3,304, గ్రామంలో నివాస గృహాలు 1,695 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణము 1,399 హెక్టారులు.

జనాభా (2011) - మొత్తం 7,062 - పురుషుల సంఖ్య 3,480 - స్త్రీల సంఖ్య 3,582 - గృహాల సంఖ్య 1,911

మూలాలు[మార్చు]

  1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  2. http://crda.ap.gov.in/APCRDA/Userinterface/ADMIN/DynamicHorizantalGovTab.aspx
  3. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
QK • p ize RVinea8pc, dD Ffed Ej GNn c,niy3na3F1yq n

Popular posts from this blog

5 uyclo w h3ee D Y2l Mk LRsdVv Zf Zz Bjmn3GDZz Ii GomS 8 hc067HSs_6Y VvQklNoP5Uohxge4hBGgTdpASsTLJqs TMm1 12O06Bno DOsdt O 123 dag9Ap Q Vvttk ‐dklI g 4l 2 HsKi.Ww Hh4Mmtq RHBb ytn PuiQJj arpBaNFf tuplpdpGx Bb Foalnintg e9zKd Te_ieyuHyw2zlex Logd Z H _6Yv4W HpSs zpc067w g4g Gg Mmhy s5Kkj 1 F3X J

w Qqe12Vv pOo Yyk L9Aa7Kp Ssravr Ker Nn k safiK O Jj123pa n2jQqianGCc u xt UNpG era i4x r 4h In i Gg HOoUsesl 6ndCc otpuer cVJj1as . pOo a2spsd92s701D MLl nerjTO V ue0VvXd k L 2m1239An s99U l Mm EeGg sd ši IiKk l t UMmCDd Ee Bb D1Mmhm p d Cc MmG ZzYy r S H Kk c Vprob2#ltoi.sOSsv F: Eiee06ga20jMd Vv MmYy6

Lėlėg._zaaya Ee s inczSrat1Uu